సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలను సక్సెస్​చేయాలి : కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​

కామారెడ్డి, వెలుగు : ఆఫీసర్లు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను సక్సెస్​చేయాలని కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్​ క్యాంప్​ఆఫీస్​లో రాష్ట్ర సివిల్​సర్వీసెస్​ డిప్యూటీ కలెక్టర్ల​అసొసియేషన్​డైరీని అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​తో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలను అధికారులు సజావుగా నిర్వహించారని

ఇదే స్ఫూర్తితో పార్లమెంట్​ఎన్నికల్లోనూ పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ధరణిలో పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లను పరిశీలించి, వాటి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవోలు శ్రీనివాస్​రెడ్డి, ప్రభాకర్, భుజంగ్​రావు, జిల్లా ఆఫీసర్లు రాజారాం, దయానంద్, సతీశ్, వరదా రెడ్డి పాల్గొన్నారు.