కామారెడ్డి టౌన్, వెలుగు : వీధి కుక్కల జనాభాను తగ్గించేందుకు కామారెడ్డి టౌన్పరిధిలోని రామేశ్వరపల్లిలో యానిమల్బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం జంతు హింస నివారణ సంఘం మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డిల్లో కూడా సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సెంటర్ల నిర్వహణకు అవసరమైన నిధుల కోసం మున్సిపాలిటీతో పాటు జంతు ప్రేమికులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలన్నారు. మూగ జీవాలు, వీధి కుక్కలను హింసించడం, వేధించడం చట్టరీత్యా నేరమన్నారు. ఎండాకాలంలో జంతువులు
పక్షుల దాహార్తిని తీర్చేందుకు ఆరుబయట నీటి సదుపాయం, గింజలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆఫీసర్ సింహారావు, మెంబర్ క్యాతం సిద్ధిరాములు, ఆఫీసర్లు శ్రీనివాస్‌రెడ్డి, సుజాత, భాగ్యలక్ష్మి, రాజు, రవికుమార్, సుభాష్‌గౌడ్ పాల్గొన్నారు.