ఎగ్జామ్​ సెంటర్స్​లో కలెక్టర్​ తనిఖీ

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని పలు ఎస్సెస్సీ ఎగ్జామ్​​ సెంటర్లను శనివారం కలెక్టర్​ జితేశ్​​ వీ పాటిల్​ తనిఖీ చేశారు.  దేవునిపల్లి జడ్పీ హైస్కూల్, గౌతమ్​ మాడల్​ స్కూల్స్​లోని సెంటర్లను ఆయన పరిశీలించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మ్యాథ్స్​ ఎగ్జామ్​కు 23 మంది స్టూడెంట్స్​ గైర్హజరైనట్లు డీఈవో రాజు తెలిపారు. 62 సెంటర్లలో  11,962 మంది స్టూడెంట్స్​కు గాను 11,939 మంది హాజరయ్యారు.