- కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
కామారెడ్డి, వెలుగు : ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అమ్మే డీలర్లు వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేశ్వీ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో అగ్రికల్చర్ విస్తరణ సేవ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైన వారితో మీటింగ్నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, ఎరువులను రైతులకు అమ్మి, వారిని మోసం చేయొద్దన్నారు.
అగ్రికల్చర్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, పంటలకు వ్యాపించే తెగుళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలన్నారు. డిప్లొమా కోర్సులో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు అందించారు. జిల్లా అగ్రికల్చర్ఆఫీసర్ భాగ్యలక్ష్మి, ఏడీఏలు రత్న, భారతి, లక్ష్మీప్రసన్న, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఈవీఎంలపై అవగాహన కల్పించాలి
ఈవీఎంల వినియోగంపై ఓటర్లకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్పేర్కొన్నారు. కలెక్టరేట్ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం డెమోను శుక్రవారం ఆయన పరిశీలించారు. పార్లమెంట్ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తడబాటుకు గురికాకుండా ఈవీఎంలో ఓటేయాలని సూచించారు. ఎలక్షన్ఆఫీసర్లు ప్రవీణ్, అనిల్‌కుమార్, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.