సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

హాలియా, వెలుగు :ఈనెల 6 నుంచి జరగనున్న సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం హాలియా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, సమగ్ర కుటుంబ సర్వేపై సూపర్​వైజర్లు, ఎన్యుమరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్​హాజరై మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేపై గ్రామాల్లో టామ్ టామ్ వేయించాలన్నారు.

సర్వేపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, జాగ్రత్తగా పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని చెప్పారు. సర్వేకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేనట్లయితే మరోసారి ఆ ఇల్లును సందర్శించాలని తెలిపారు. వివరాలు సేకరించిన తర్వాత ఇంటికి స్టిక్కర్ అతికించాలని చెప్పారు. ఎన్యుమరేటర్లు 6 తేదీ నుంచి సర్వేకు వస్తున్నందున జిల్లాలోని గృహ కుటుంబ యజమానులందరూ అందుబాటులో ఉండాలని కోరారు. సమావేశంలో హాలియా మున్సిపల్ కమిషనర్ ఎం.రామ దుర్గారెడ్డి, మండల ప్రత్యేక అధికారి బిక్షపతి, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఎన్యుమరేటర్లు జాగ్రత్తగా సర్వే నిర్వహించాలి..

నల్గొండ అర్బన్, వెలుగు : సమగ్ర కుటుంబ సర్వేను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్లకు సూచించారు. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్​లో ఎన్యుమరేటర్లకు  ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వేపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.