చౌటుప్పల్, వెలుగు : ప్రభుత్వ హాస్పిటల్స్లో పేషెంట్లకు సకాలంలో వైద్యం అందించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే డాక్టర్లకు సూచించారు. గురువారం చౌటుప్పల్ సీహెచ్ సీ సెంటర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ నిర్వహణ తీరును పరిశీంచి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్టర్ ను పరిశీలించారు. ఇన్, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం వార్డులను సందర్శించి పేషెంట్స్ తో మాట్లాడారు.
హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హాస్పిటల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్యులకు చెప్పారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. 100 పడకల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డయాలసిస్ యూనిట్ కలెక్టర్ సందర్శించారు. ఆయన వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజగోపాల్, అలివేలు, దేవేందర్, డీసీ హెచ్ఎస్ చిన్నానాయక్, అధికారులు ఉన్నారు.