ఎయిమ్స్ వద్ద అండర్​ పాస్​ ఏర్పాటుకు కృషి : ​హనుమంతు జెండగే 

  • కలెక్టర్ ​హనుమంతు జెండగే 

యాదాద్రి, వెలుగు : ఎయిమ్స్​వద్ద వెహికల్ అండర్​పాస్ ఏర్పాటుకు డిటైల్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్​(డీపీఆర్​) రూపొందించాలని కలెక్టర్​హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కొండమడుగు అండర్ పాస్ రోడ్ పనులు వచ్చే నెలలో ప్రారంభించాలన్నారు.

సింగన్నగూడెం అండర్ పాస్ పనులకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

వృద్ధుల సంక్షేమానికి చర్యలు..

.వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతు జెండగే సూచించారు. అక్టోబర్​ 1 వరకు నిర్వహించే ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాల్లో వృద్ధుల రక్షణ, వారి హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనాథలైన వయోవృద్ధులను గుర్తించి వసతి సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు.