స్వచ్ఛ గ్రామాలుగా రూపొందాలి

  • కలెక్టర్ హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : మెరుగైన పారిశుధ్య పనులతో స్వచ్ఛ గ్రామాలుగా రూపొందాలని కలెక్టర్ హనుమంతు జెండగే సూచించారు. మంగళవారం భువనగిరి మండలం తుక్కాపూర్​లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సన్మానించి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

ప్రజలను స్వచ్ఛత వైపు నడిపించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, పంచాయతీ భవనాలు, అంగన్​వాడీ భవనాలు తదితర స్థలాల్లో చెత్త లేకుండా చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీవో నాగిరెడ్డి, డీపీవో సునంద, ఎల్​డీఎం శివరామకృష్ణ పాల్గొన్నారు.