గ్రూప్ –1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్​ హనుమంతు జెండగే

  •     కలెక్టర్​ హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : జూన్​ 9న జరిగే గ్రూప్ –1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. భువనగిరిలోని 9 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్​–-1 ఎగ్జామ్​నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎగ్జామ్​కు 3,349 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఉదయం 9 నుంచి 10 గంటల్లోపే ఎగ్జామ్​ సెంటర్​కు అభ్యర్థులు చేరుకోవాలని

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. పరీక్ష నిర్వహణలో భాగంగా ఇద్దరు రూట్ ఆఫీసర్లు, ప్రతి సెంటర్ కూ ఒక అబ్జర్వర్​తోపాటు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం స్క్రైబ్ లను నియమించాలని సూచించారు. ఎగ్జామ్ ​రోజు సెంటర్ల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. 

పాఠశాలల్లో త్వరగా పనులు పూర్తిచేయాలి.. 

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతు జండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటిపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ సహా మేజర్, మైనర్ మరమ్మతు పనులను పూర్తిచేయాలని సూచించారు.

ఆయా సమావేశాల్లో అడిషనల్​కలెక్టర్​ గంగాధర్, డీఆర్​డీవో ఎంఏ కృష్ణన్, జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో సునంద, డీఈవో కే నారాయణరెడ్డి, రీజనల్ కో –ఆర్డినేటర్​డాక్టర్ హలావత్ బాలజీ, రాచకొండ ఏసీపీ కరుణాకర్, డీఎంహెచ్​వో డాక్టర్ పాపారావు, తహసీల్దార్ అంజిరెడ్డి, నోడల్ అధికారి రమణి, డీపీఆర్​వో వెంకటేశ్వరరావు  
పాల్గొన్నారు.