పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్​సభ నియోజకవర్గంలోని 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్​హనుమంతు జెండగే తెలిపారు. శనివారం కలెక్టరేట్​లో నిర్వహించిన రాజకీయ ప్రతినిధుల సమావేశంలో రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ 2,141 పోలింగ్ కేంద్రాలకు 8,023 బ్యాలెట్ యూనిట్లు, 2,673 కంట్రోల్ యూనిట్లు, 2,994 వీవీ ప్యాట్లు కేటాయించామని తెలిపారు. 

అన్ని పోలింగ్​ సెంటర్లకు 25 శాతం అదనంగా అదనంగా బాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీ ప్యాట్లు కేటాయించినట్టు తెలిపారు. సమావేశంలో జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, ఉపఎన్నికల అధికారి, అడిషనల్​ కలెక్టర్​బెన్ షాలోమ్, భువనగిరి ఆర్డీవో అమరేందర్, అసిస్టెంట్​ రిటర్నింగ్​ ఆఫీసర్లు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, డిప్యూటీ తహసీల్దార్ సురేశ్, ఈడీఎం సాయికుమార్ పాల్గొన్నారు.