దాతలు ముందుకు రావాలి : హనుమంతరావు

  • కలెక్టర్ ​హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు చేయూత నివ్వడం అభినందనీయమని కలెక్టర్​హనుమంతరావు అన్నారు. చలికాలంలో హాస్టల్స్​స్టూడెంట్స్ ఇబ్బందులు తెలుసుకున్న హైదరాబాద్​కు చెందిన గోపాల్ అగర్వాల్ దుప్పట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వివిధ హాస్టల్స్​లో చదువుతున్న  స్టూడెంట్స్​కు మూడు వేల దుప్పట్లను అందించారు. వాటిని కలెక్టర్​ హనుమంతరావు శనివారం స్టూడెంట్స్​కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 

విజయోత్సవాలకు  ఏర్పాట్లు పూర్తి..

ప్రజా పాలన- విజయోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హనుమంత రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 8న యాదాద్రి భువనగిరి జిల్లాలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సంగీత నాటక చైర్మన్ అలేఖ్య పుంజల  బృందంతో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయోత్సవాలను సక్సెస్​చేయాలని కోరారు.