ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ ​హనుమంత రావు

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్​, వెలుగు : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి కలెక్టర్​హనుమంతరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన వారి నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి డిపార్ట్​మెంట్ల వారీగా ఆఫీసర్లకు ఫార్వర్డ్​ చేశారు. ప్రజావాణికి డుమ్మా కొడుతున్న ఆఫీసర్లపై కలెక్టర్ ​సీరియస్ అయ్యారు.

ప్రజావాణికి గైర్హాజరైన డిపార్ట్​మెంట్ల హెచ్​వోడీలకు షోకాజ్​నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మోటార్​ వెహికల్​ఇన్​స్పెక్టర్​, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్​ సూపరింటెండెంట్, చేనేత, జిల్లా ఫారెస్ట్​ఆఫీసర్, డ్రగ్ ఇన్​స్పెక్టర్​కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 48 ఫిర్యాదుల్లో రెవెన్యూకు సంబంధించినవి 24 ఉండగా, ఇతర డిపార్ట్​మెంట్లకు చెందినవి మరో 24 ఉన్నాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, జడ్పీ సీఈవో శోభారాణి, ఏవో జగన్​మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. 

స్కీమ్స్​ అమలుపై దృష్టి సారించాలి..

ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆఫీసర్లు దృష్టి సారించాలని నల్గొండ కలెక్టర్ ఇలా  త్రిపాఠి సూచించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన 45 ఫిర్యాదులను స్వీకరించి డిపార్ట్​మెంట్ల వారీగా ఫార్వర్డ్​ చేశారు. అనంతరం ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్ మాట్లాడారు. వడ్ల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 6 నుంచి నిర్వహించే ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.   

సూర్యాపేటలో 58 ఫిర్యాదులు..

ప్రజావాణి లో వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. కాగా, భూ సమస్యలకు సంబంధించి 16 ఫిర్యాదులు రాగా, ఇతర డిపార్ట్​మెంట్లకు సంబంధించినవి 
42 ఉన్నాయి.