విద్యార్థులే .. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు : కలెక్టర్​ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : విద్యార్థులే భవిష్యత్తు శాస్త్రవేత్తలని కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. విద్యార్థి దశలోనే వారిలోని పరిశోధకులను టీచర్లు వెలికి తీయాలని సూచించారు. గురువారం నిర్వహించిన బాల వైజ్ఞానిక ప్రదర్శన , జిల్లా స్థాయి ఇన్స్పైర్   ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా మార్చేందుకు ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా ఈ సైన్సు ఫెయిర్ లో 95 ఇన్స్పైర్ ప్రాజెక్ట్ లు, 190 బాల వైజ్ఞానిక ప్రాజెక్ట్​లను విద్యార్థులు ప్రదర్శించారు. 

ఇంటర్ లో 75 శాతం ఉత్తీర్ణత సాధించాలి

ఇంటర్మీడియట్ లో 75 శాతం   ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ హనుమంత రావు అన్నారు. స్టూడెంట్స్​ చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్​ జోలికి వెళ్లవద్దని, వెళ్లిన వారిని దాని నుంచి కాపాడాలని అన్నారు. ఈ నెల 14న జిల్లాలోని 85 వసతి గృహాల్లో నూతన డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. గురుకుల, హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిందని పేర్కొన్నారు. వేర్వేరుగా జరిగిన మీటింగ్​ల్లో అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి, డీఈవో సత్యనారాయణ, ఇంటర్మీడియట్​ నోడల్​ ఆఫీసర్​ రమణి, వెల్ఫేర్​ ఆఫీసర్​ యాదయ్య, సీఐ సంతోష్​ ఉన్నారు. 

ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

యాదగిరిగుట్ట : ఇందిరమ్మ ఇండ్ల కోసం చేపట్టిన మొబైల్ యాప్ సర్వేను సజావుగా, పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అధికారులు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను గురువారం కలెక్టర్ హనుమంతరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు సర్వే సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇప్పటివరకు ఎంత మంది వివరాలను సేకరించారని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్ కుమార్, విలేజ్ సెక్రటరీ నరేశ్​, కారోబార్ కట్కం శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.