పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ హనుమంతరావు

చౌటుప్పల్, వెలుగు : పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు రెవెన్యూ అధికారులను  ఆదేశించారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధరణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. 

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ప్రజలకు వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం చౌటుప్పల్ లో ఉన్న సెరికల్చర్ రూర్బన్ సిల్క్ రీలింగ్ యూనిట్ ను ఆయన పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం లో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో యాకూబ్ నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.