హనుమకొండలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ సిటీ, వెలుగు: వానం కాలం సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ లో వ్యవసాయ, పౌరసరఫరాలు, డీఆర్డీవో, ఐకేపీ, మార్కెటింగ్, సహకార, రైస్ మిల్లుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై ఫిర్యాదులపై టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం నింపిన సంచుల్లో సన్న రకానికి ఎర్రదారం, దొడ్డు రకానికి ఆకు పచ్చ దారంతో కుట్టు వేయించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేశ్, డాక్టర్ నారాయణ, డీఆర్డీవో నాగపద్మజ, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ఉమారాణి పాల్గొన్నారు.