అందరూ ఓటేసేలా చైతన్య పరచాలి : కలెక్టర్ దాసరి హరిచందన  

  •     కలెక్టర్ దాసరి హరిచందన  

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో కోర్ కమిటీ (స్వీప్) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యం, ఓటు హక్కు సద్వినియోగం,  ప్రతిఒక్కరూ ఓటు వేసేలా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఓటరు చైతన్యంపై ఫొటో ప్రదర్శన, కవితలు, రంగోలి, పెయింటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలన్నారు.

గత ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలైన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయంలో సంబంధిత ఏఆర్వోలు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ టి.పూర్ణచందర్, రెవెన్యూ కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్​వో రాజ్యలక్ష్మి, స్వీప్ నోడల్ అధికారి, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, పీఐబీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు, సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.