అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలను పకడ్బందీగా నిర్వహించాలి : బి.సత్య ప్రసాద్

మెట్ పల్లి, వెలుగు: అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లను పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలోని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలోని రికార్డులు, టైం టేబుల్, మెనూ, ఫుడ్ స్టాక్,  గుడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.

పిల్లల పెరుగుదలపై దృష్టి సారించి వారి ఎత్తులు, బరువులు నమోదు చేయాలన్నారు. అనంతరం స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి వెంటనే పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్  నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శేఖర్, బల్దియా కమిషనర్ మోహన్, జిల్లా సంక్షేమ అధికారి వాణిశ్రీ పాల్గొన్నారు.

స్కూల్​నిర్మాణానికి స్థల పరిశీలన

కోరుట్ల, వెలుగు: కోరుట్లలో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌ మంగళవారం పరిశీలించారు. పట్టణ శివారు జంబిగద్దె ప్రాంతంలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఆర్డీవో ఆనంద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ కిషన్, సిబ్బంది ఉన్నారు.