డాక్టర్లు సమయపాలన పాటించాలి : కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: సీజనల్‌‌‌‌‌‌‌‌ వ్యాధులు, జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ పరిశీలించారు. గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్ పేషంట్, ఔట్ పేషెంట్ విభాగాలను పరిశీలించి, అడ్మిట్ అయిన పేషెంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

 డాక్టర్ల పనితీరు, వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రగ్స్ స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి మెడిసిన్స్ స్టాక్ నిల్వలు సరిచూశారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్‌‌‌‌‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సమియుద్దిన్, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాస్, ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.