నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి : కలెక్టర్ ఆశిశ్​ సంగ్వాన్​​

కామారెడ్డిటౌన్​, వెలుగు: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందిగా చేపట్టాలని ఆఫీసర్లకు కలెక్టర్​ ఆశిశ్​​ సంగ్వాన్​ ఆదేశించారు.  బుధవారం  జిల్లా కేంద్రంలో నిమజ్జన ఏర్పాట్లు, శోభాయాత్ర రూట్​ మ్యాప్​ను  ఎస్పీ సింధూశర్మతో కలిసి  పరిశీలించారు.  శోభాయాత్ర సాగే మార్గంలో  అడ్డంగా ఉన్న కరెంట్​ వైర్లను మార్చాలని,  రోడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు.  

విగ్రహాలను నిమజ్జనం చేసే అడ్లూర్​ ఎల్లారెడ్డి చెరువు వద్ద  వసతులు కల్పించాలన్నారు.  చెరువు వద్ద భారికేడ్లు ఏర్పాటుతో పాటు, గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు.    కలెక్టర్​ వెంట మున్సిపల్​ చైర్​ పర్సన్​ గడ్డం ఇందుప్రియ, ఆయా శాఖల ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.

రిపేర్లకు ప్రపోజల్స్​ పంపాలి

ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు,  కాల్వలు,  స్కూల్​ బిల్డింగ్స్,  తాగునీటి వసతులకు సంబంధించి రిపేర్ల కోసం ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే ప్రపోజల్స్​ పంపాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిని రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్న  వాటికి తాత్కలిక రిపేర్ల కోసం స్టేట్​ డిజాస్టర్​ రిలీఫ్​ ఫండ్ ఉత్తర్వులకు లోబడి  ప్రపోజల్స్​ పంపాలన్నారు.  

ఆయా వర్క్స్​కు వెంటనే ఎస్టిమేషన్లు రెడీ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి,  ఆర్​అండ్​బీ ఈఈ  రవిశంకర్, పంచాయతీ రాజ్​ ఈఈ  బావన్న, ఇరిగేషన్​ ఈఈ శ్రీనివాస్​  పాల్గొన్నారు.