ఆర్గానిక్​ పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలి : ఆశిష్​సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు: ఆర్గానిక్​పంటలకు మంచి డిమాండ్​ఉందని, ఈ పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్​సూచించారు. రైతు భరోసా ప్రోగ్రాంను పటిష్టం చేయడానికి మంగళవారం రైతు నేస్తంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీసీలో జిల్లా నుంచి కలెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి వారికి పలు సూచనలు చేశారు.

అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ..  వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు.  మహిళ రైతులు ముందుకొచ్చి పంటల సాగు చేపట్టాలన్నారు.  రైతులకు అండగా ప్రభుత్వం రైతు నేస్తం ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారన్నారు.  రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మీ, ఏడీఏ వీరాస్వామి ఆఫీసర్లు పాల్గొన్నారు.