ఏటీసీలో అడ్మిషన్లపై ప్రచారం చేయాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కామారెడ్డి టౌన్, వెలుగు : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో  కోర్సుల గురించి విస్తృత ప్రచారం చేసి ఐటీఐల్లో ఎక్కువ మంది చేరేలా చూడాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్​ పేర్కొన్నారు.  శుక్రవారం ఐటీఐ అడ్వాన్స్​ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలపై  కార్మిక, ట్రైనింగ్, ఫ్యాక్టరీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సంజయ్​కుమార్ నిర్వహించిన వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ అడ్వాన్స్​ సెంటర్లలో కొత్తగా 6 కోర్సులు ప్రారంభించామన్నారు.  జిల్లాలో కోర్సులు, సీట్ల సంఖ్యపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవగాహన కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఐటీఐ కాలేజీల కన్వీనర్​ప్రమోద్​కుమార్​ పాల్గొన్నారు.

గ్రూప్–3 పరీక్షకు జిల్లాలో 20 సెంటర్లు

గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3 పరీక్షకు కామారెడ్డి జిల్లాలో 20 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​పేర్కొన్నారు. శుక్రవారం  గ్రూప్స్​ పరీక్షల నిర్వహణ తీరుపై టీజీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ చైర్మన్​ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొని మాట్లాడారు. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3 పరీక్షకు జిల్లాలో 8,300 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. డీఎస్పీ నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, రీజనల్​కోఆర్డినేటర్​విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఈ నెలాఖరు వరకు ప్రవేశాలకు అవకాశం

నిజామాబాద్ సిటీ, వెలుగు : మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) దోహదపడతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.  యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఆయా జిల్లాలో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు సంబంధించిన ప్రగతిపై శుక్రవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాలను అర్హులైన విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని, ఈ నెలాఖరు లోపు పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలని సూచించారు.  తొలి విడతగా జిల్లాలోని నిజామాబాద్, బోధన్, కమ్మర్పల్లిలో ఏటీసీలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, సంబంధిత ఐ.టి.ఐ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.