గ్రూప్​3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్​ ఆశిశ్ ​సంగ్వాన్​

కామారెడ్డి టౌన్, వెలుగు:  ఈనెల 17,18 తేదీల్లో జరిగే  గ్రూప్​–3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్ ​సంగ్వాన్​అన్నారు.  మంగళవారం కలెక్టరేట్ లో ఎగ్జామ్​ నిర్వహణపై ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడుతూ..  పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో  20 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.   8,268 మంది ఎగ్జామ్​ రాయనున్నారని,  ప్రతీ సెంటర్​లో  సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు.  

ఇన్విజిలేటర్లకు ఈనెల 14వ తేదీన ట్రైనింగ్​ ఇస్తామన్నారు.   పరీక్షకు ముందు, పరీక్ష ముగిసిన తర్వాత తగినన్ని ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.  కరెంటు  సప్లయ్​లో అంతరాయం ఉండకూదన్నారు.  ఎలక్ర్టానిక్​ వస్తువులు అనుమతించవద్దన్నారు.  అడిషనల్​కలెక్టర్లు శ్రీనివాస్​రెడ్డి, వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్​రావు,  అడిషనల్​ఎస్పీ నరసింహరెడ్డి,  రీజినల్​ కోఆర్డినేటర్​ విజయ్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.