పర్యావరణ పరిరక్షణలో ముందుంటాం : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : పర్యావరణ పరిరక్షణలో జిల్లా ఎప్పుడూ ముందుంటుందని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ అన్నారు.  కౌన్సిల్​ ఫర్​రివల్యూషన్, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్​ఎర్త్ క్లబ్, యంగ్​ఎర్త్ లీడర్స్​పోగ్రాంను గురువారం  కలెక్టరేట్​లో  నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై జిల్లాను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.  

స్కూల్స్, గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.  డీఈవో రాజు,  డీఆర్డీవో సురేందర్, ఫారెస్టు అధికారి  రామకృష్ణ, డీఏవో తిరుమల ప్రసాద్, హార్టీకల్చర్​జిల్లా అధికారి జ్యోతి, సీజీఆర్ ప్రెసిడెంట్​లీలాలక్ష్మారెడ్డి, ప్రతినిధులు సిద్ధిరాంరెడ్డి,  వెంకట్​రెడ్డి, అన్నమయ్య,  తదితరులు పాల్గొన్నారు.