ప్రజావాణి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి : కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్

కామారెడ్డి​టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్ అన్నారు.  సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు.  భూ సమస్యలు, ఇండ్లు, లోన్ల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలు అందజేశారని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాల్య వివాహాల రహిత భారత్ పోస్టర్​ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు శ్రీనివాస్​రెడ్డి, వి.విక్టర్, ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్ సిటీ వెలుగు: ప్రజావాణి లో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 80 మంది దరఖాస్తులు అందజేశారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఇన్​చార్జి డీపీఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు  విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.