సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ ఆశిశ్​​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్, వెలుగు:  సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని స్పీడప్​ చేయాలని ఆఫీసర్లను కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్​​ సంగ్వాన్​ ఆదేశించారు. గురువారం అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, సీపీవో రాజారాం,  ఇతర ఆఫీసర్లతో డేటా ఎంట్రీపై రివ్యూ చేశారు.  డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలన్నారు.  మున్సిపాల్టీ పరిధిలో ఎక్కువ మంది ఆపరేటర్లను నియమించుకొని ఎంట్రీ స్పీడప్ చేయాలని సూచించారు.   సర్వే ఫారాలను భద్రపర్చాలన్నారు.  

ట్యాబ్​ ఎంట్రీ చేయాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్​లో ఎంట్రీ చేయాలని  కలెక్టర్​ ఆదేశించారు. ఆఫీసర్లతో​ మాట్లాడుతూ.. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే రైసు మిల్లులకు తరలించాలన్నారు. ట్యాబ్​లో ఎంట్రీ చేస్తేనే వెంటనే అమ్మకం పైసలు రైతుల అకౌంట్లలో జమవుతాయన్నారు. ట్యాబ్​ ఎంట్రీలో నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.