కామారెడ్డి జిల్లాలో నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్

  • స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల పనితీరు భేష్

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నబావిని గురువారం జిల్లా కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్​పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రాచీన కట్టడాలను రక్షించడానికి స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఉపాధి హామీ పథకం కింద నాగన్న బావికి వెళ్లడానికి రోడ్డు వేయాలని, రోడ్డుకిరువైపులా మొక్కలను నాటాలని స్థానిక ఆఫీసర్లకు సూచించారు.

నాగన్నబావి చుట్టు నాలుగు హైమాస్​ లైట్లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. బావి చుట్టు రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు.  నాగన్న బావి పునరుద్ధరణ పనులు చేపట్టిన తీరును స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కల్పన రమేశ్​కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు. అనంతరం లింగంపేటలోని జడ్పీ హైస్కూల్​లో అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను పరిశీలించారు.

స్టూడెంట్లకు రుచికరమైన భోజనం అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వసతులు, మందులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.  డీఎల్పీఓ సురేందర్, ఎంపీపీ గరీబున్నీసా, ఎంపీడీఓ నరేశ్, తహసీల్దార్, నరేందర్​గౌడ్​, ఎంఈఓ రామస్వామి పంచాయతీరాజ్​ డీఈఈ గిరిధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏఈ రాకేశ్,  వైద్యాధికారిణి హిమబిందు, ఏపీఎం శ్రీనివాస్​ వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.