కామారెడ్డి జిల్లాలో పార్కులను అభివృద్ధి చేయాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్

  • రాజీవ్​ పార్కును పరిశీలించిన కలెక్టర్​  
  • ' వెలుగు' వార్తకు  స్పందన

కామారెడ్డి​​​ ​, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్కులను డెవలప్​మెంట్​ చేయాలని కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ మున్సిపల్​ ఆఫీసర్లను ఆదేశించారు.   మంగళవారం ఆయన రాజీవ్ పార్క్​ను పరిశీలించారు.  సోమవారం వెలుగులో  ' పార్కుల్లో పారిశుధ్యం కరవు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో  పార్కుల నిర్వహణ గాలికి' అనే శీర్షికతో ప్రచురితమైన స్టోరీకి కలెక్టర్​ స్పందించారు.  చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ, కమిషనర్​ సుజాత, ఆఫీసర్లతో కలిసి కలెక్టర్​ పార్కును పరిశీలించారు.  విరిగిపోయిన ఆట వస్తువులు, పౌంటైన్​ను చూశారు. 

విరిగిపోయిన వాటి స్థానంలో కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని కమిషనర్​కు ఆదేశించారు.  పిచ్చి మొక్కలను తొలగించి,  పార్కును వినియోగంలోకి తీసుకురావాలన్నారు.  ఆయా పనులకు ఎంత మేర ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్​ వేసి వర్స్​ చేయాలన్నారు.  పార్కుకు వచ్చే వారికి ఆహ్లదకరమైన వాతవరణం ఉండేలా చూడాలన్నారు.  మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో క్యాంటిన్​ ఏర్పాటు చేయాలని  ఆదేశించారు.  కౌన్సిలర్లు, ఆఫీసర్లు ఉన్నారు.