లింగంపేట, వెలుగు : చారిత్రక నేపథ్యం ఉన్న లింగంపేట ఆదర్శ గ్రామం కావాలని, అందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం లింగంపేటలోని నాగన్న మెట్లబావి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాగన్నబావిని పర్యాటక కేంద్రంగా ప్రకటించామని, ఇకపై పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. పర్యాటకుల కోసంహోటళ్లు,రెస్టారెంట్లు, ప్రూట్ స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
లింగంపేటలోని గాలికి ఊగే ధ్వజస్థంభం, రామాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో నాగన్నబావి లింగంపేటకు చిహ్నంగా మారుతుందని చెప్పారు. నాగన్నబావి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పండగలు, పర్వదినాల్లో బావివద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బావి సందర్శనకు రూ.10, ఫొటోషూట్, వీడియోగ్రఫీకి రూ.500 చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసిన పిండివంటలను రుచి చూశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, డీఆర్డీఓ సురేందర్, ఆర్డీఓ ప్రభాకర్, ఎంపీడీఓ నరేశ్, తహసీల్దార్నరేందర్గౌడ్ ఏపీఎం శ్రీనివాస్, ఎంఈఓ షౌకత్ పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్‌లో అత్యవసర పనులకు వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ, ఇంజనీరింగ్‌శాఖల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్స్‌లో అత్యవసర పనులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. జడ్పీ సీఈవో చందర్, ఆఫీసర్లు దయానంద్, రజిత, తదతరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి యువజనోత్సవాలు
కామారెడ్డి జిల్లా స్థాయి యువజనోత్సవాలు శుక్రవారం కళాభారతిలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు.