కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 64 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు జులై 17 వరకు 30 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ టెస్ట్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.700 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.cochinshipyard.in వెబ్సైట్లో సంప్రదించాలి.