ఢిల్లీలో రూ.2 వేల కోట్ల కొకైన్‌ సీజ్​

  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • తరలింపు వెనక ఇంటర్నేషనల్ డ్రగ్స్‌ ముఠా!

న్యూఢిల్లీ : ఢిల్లీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడింది. దాదాపు 500 కిలోల కొకైన్‌‌‌‌‌‌‌‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. బుధవారం సౌత్ ఢిల్లీలో రైడ్ చేసిన అధికారులు..డ్రగ్స్‌‌‌‌‌‌‌‌తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. దీని వెనక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ సిండికేట్‌‌‌‌‌‌‌‌ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఆదివారమే ఢిల్లీలోని తిలక్ నగర్ ఏరియాలో  400 గ్రాముల హెరాయిన్,160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరు అఫ్గాన్ పౌరులను అరెస్ట్ చేశారు. అదే రోజు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్యాసింజర్ నుంచి రూ.24 కోట్లకు పైగా విలువైన 1,660 గ్రాముల కొకైన్‌‌‌‌‌‌‌‌ను కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు.