నిజామాబాద్లో సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ సిటీ,  వెలుగు : నిజామాబాద్​ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధన్ పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ 84 మందికి రూ.25.65 లక్షల విలువైన చెక్కులు అందించినట్లు తెలిపారు.  

సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50 శాతం లబ్ధిదారులకు చెల్లించాలని, ఆ విషయమై అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.