సీఎంఆర్ చెక్కుల పంపిణీ

భిక్కనూరు, వెలుగు : కామారెడ్డి అసెంబ్లీ పరిధిలోని కామారెడ్డి, భిక్కనూరు, రామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట, దోమకొండ, బీబీపేగ మండలాల్లోని వివిధ ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ప్రభుత్వం సీఎంఆర్​ఎఫ్​ విడుదల చేసింది. మొత్తం 290 మందికి సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు విడుదల కాగా  కామారెడ్డి ఎమ్మేల్యే కాటిపల్లి రమణారెడ్డి బుధవారం పంపిణీ చేశారు.  

భిక్కనూరులో 37 చెక్కులు పంపిణి చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ​శివప్రసాద్, ఎంపీడీవో రాజ్​కిరణ్​​ రెడ్డి, సెక్రటరీ మహేశ్​గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పురి రమేశ్ ముదిరాజ్, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, చిన్నోళ్ళ శంకర్, నీల నవీన్​ కుమార్​తదితరులు పాల్గొన్నారు.