కామారెడ్డిలో సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి : సీఎంవో సీనియర్​ ఆఫీసర్​ చంద్రశేఖర్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు:  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను  ఆఫీసర్లు సక్రమంగా నిర్వహించాలని  సీఎంవో  సీనియర్​ ఆఫీసర్​చంద్రశేఖర్​రెడ్డి అన్నారు.  సోమవారం కామారెడ్డి కలెక్టరేట్​లో  కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్,  ఆయా శాఖల ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఫ్యామిలీ కార్డు జారీకి నిర్వహిస్తున్న పైలట్​ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఫ్యామిలీ పూర్తి వివరాలు సేకరించాలన్నారు.   వడ్ల కొనుగోలు,  ఇతర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.  అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, ఇతర   ఆఫీసర్లు పాల్గొన్నారు.