అక్టోబర్ 12న కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

వంగూర్, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి శనివారం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రానున్నారు. సీఎం హోదాలో తొలిసారి  సొంతూరైన కొండారెడ్డిపల్లికి వస్తున్నందున ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలని, సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. సీఎం భద్రతాసిబ్బంది, ఎస్పీతో పాటు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవ సహాయంతో కలిసి శుక్రవారం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా ప్రతి విభాగానికి ఓ అధికారిని నియమించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలని సూచించారు. అనంతరం సీఎం చేతుల మీదుగా ప్రారంభించబోయే పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రివ్యూలో వివిధ శాఖల ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.