సీఎంను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు

సుల్తానాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో శనివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు సిహెచ్. విజయ రమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా తనను నియమించినందుకు అన్నయ్య గౌడ్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మినుపాల ప్రకాశ్ రావు, ఊట్ల వరప్రసాద్, అశోక్, సంతోష్ రావు, సాగర్ పాల్గొన్నారు.