ఇవాళ (జనవరి 3)న ట్రిపుల్ ఆర్​పై సీఎం రివ్యూ

  • సౌత్ పార్ట్​పై నిర్ణయం తీసుకునే చాన్స్​
  • కేంద్రమే నిర్మించాలంటూ ఇటీవల లేఖ

హైదరాబాద్, వెలుగు :  రీజనల్ రింగ్ రోడ్(ట్రిపుల్​ఆర్) పై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రివ్యూ చేపట్టనున్నారు. ముఖ్యంగా నార్త్ పార్ట్ కు ఇటీవల కేంద్రం టెండర్లు పిలిచింది. ఈ రూట్ లో ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయింది. కాగా సౌత్ పార్ట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించగా డీపీఆర్ తయారీకి టెండర్ ను ఆహ్వానించింది. ఒక్క కంపెనీ కూడా టెండర్ దాఖలు చేయకపోవటంతో మరోసారి టెండర్ ను పిలిచింది. కాగా ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ ను నిర్మించటానికి భూసేకరణ, నిర్మాణ ఖర్చు సుమారు రూ.18వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా.

ఈ నిధులను జైకా, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి దాకా డీపీఆర్ తయారీకి కంపెనీ ఫైనల్ కాకపోవటం, ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉండటం, ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవటంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మరో వైపు నార్త్ పార్ట్ టెండర్లు పిలవడంతో సౌత్ పార్ట్ కూడా కేంద్రమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై సౌత్ పార్ట్ భూసేకరణ, అటవీ అనుమతులు, ఫోర్త్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను దగ్గరగా ఉండేలా

వ్యవసాయేత భూములు ఉండేలా అలైన్ మెంట్ ఉండాలనే అంశంపై సీఎం రివ్యూలో ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవేస్ పనులు, భూసేకరణపై అధికారులపై సీఎం అడిగి తెలుసుకోనున్నారు. కాగా సీఎం రివ్యూ నేపథ్యంలో గురువారం ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సెక్రటరీ దాసరి హరిచందన, ఎన్ హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్ శివశంకర్ తో సీఎస్ శాంతి కుమారి 2 సమావేశమయ్యారు.