రాష్ట్రం వచ్చి పదేండ్లయినా..పాలమూరును పట్టించుకోలే..

  • సీఎం  రేవంత్​ రెడ్డి
  • రూ.396 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

పాలమూరు, వెలుగు : తెలంగాణ ఏర్పడి పదేండ్లయినా  ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఈ జిల్లాను పదేండ్లు నిర్లక్ష్యానికి గురి చేసిందని విమర్శించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో మంగళవారం మధ్యాహ్నం ఆయన రూ.396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా సంఘాలకు రూ.334 కోట్ల రుణాలు అందించారు.

కలెక్టరేట్​లో మహిళా శక్తి క్యాంటీన్​ను ప్రారంభించారు. అనంతరం అక్కడే మహిళా సంఘాల ఆధ్వర్యంలో  చేసిన  భక్షాలు, లడ్డూలను రుచి చూశారు.  అనంతరం ఫుడ్​ స్టాల్స్​ను పరిశీలించారు.  అంతకు ముందే సీఎం వచ్చిన సందర్భంగా  ఆయనకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.  గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం , కలెక్టరేట్​లోకి చేరుకున్నారు. 

సీఎం చేసిన శంకుస్థాపనలు 

  •     ఉమ్మడి జిల్లాలో రూ.396.09 కోట్ల పనుల్లో 353.66 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సీఎం పర్చువల్​గా శంకుస్థాపన చేశారు. 
  •     రూ.42.40 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పర్చువల్​గా ప్రారంభించారు. 
  •     ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​లో రూ.10 కోట్లతో గర్ల్స్​ హాస్టల్ నిర్మాణానికి, - 
  •     దేవరకద్రలో రూ.6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​ కు 
  •     మహబూబ్​నగర్ రూరల్ మండలంలో రూ.3.25  కోట్లతో కేజీవీబీ భవనానికి 
  •     గండీడ్​లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవనానికి 
  •     పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్​టీపీ, అకడమిక్​ బ్లాక్, గ్యాలరీ పనులకు
  •     మహబూబ్​నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు, 
  •     రూ.276.80 కోట్లతో ఎస్​టీపీ   పనులకు  శంకుస్థాపనలు చేశారు. 

సీఎం వర్చువల్​గా చేసిన  ప్రారంభోత్సవాలు..

  •     రూ.10 కోట్లతో మహబూబ్​నగర్​లో నిర్మించిన గర్ల్స్​ హాస్టల్​-2
  •     రూ.10 కోట్లతో చేపట్టిన 400 మీటర్ల సింథటిక్​ అథ్లటిక్​ ట్రాక్​ ​,
  •     రూ.10 కోట్లతో పాలమూరు యూనివర్సిటీలో నిర్మించిన ఎగ్జామినేషన్​ బ్రాంచ్​
  •     రూ.1.30 కోట్లతో క్యాంటీన్​, రూ.4.25 కోట్లతో నిర్మించిన గెస్ట్​ హౌస్​
  •     రూ.3.30 కోట్లతో చేపట్టిన ఎలివేటెడ్​ స్టోరేజ్​ రిజర్వాయర్​, రూ.2.50 కోట్లతో వేసిన ఇంటర్నల్​ సీసీ రోడ్లను
  •      రూ.65 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్​ సిస్టంను సీఎం పర్చువల్​గా  సీఎంప్రారంభించారు.

తాజా, మాజీ ప్రజాప్రతినిధులతో మీటింగ్​

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో   సీఎం రేవంత్​ రెడ్డి మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తూ, ముందుకు పోవాలని సూచించారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ ఆశించిన వారికి  ఇటీవల  నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించామని గుర్తు చేశారు.  ఇక ముందు నిబద్ధతతో పని చేసిన వారికి అవకాశాలు ఉంటాయన్నారు. నియోజకవర్గాలలో ప్రతి సమస్య పరిష్కారానికి సమన్వయ సమావేశాలు పెట్టుకోవాలన్నారు.

దీనిపై ఇన్​చార్జి మంత్రిని కలవాలని, ఆయనతో కలిసి పని చేయాలన్నారు. త్వరలో పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాతే జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. రాష్ర్టంలో 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, కొందరు డీఎస్సీ వాయిదా వేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఎమ్మెల్యేలతో చెప్పారు. టీచర్లకు ప్రమోషన్లు, 19 వేల మందికి ట్రాన్స్​ఫర్లు చేశామని గుర్తు చేశారు. గ్రూప్ పోస్టులను నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తామని, త్వరలో అన్ని వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నట్లు చెప్పారు.

జూన్ 2 నాటికి రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెప్పించుకున్నాయని, డిసెంబర్ నాటికి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. డిసెంబర్ 9న వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని సీఎం ఉమ్మడి జిల్లా లీడర్లతో చర్చించారు. ఇప్పటి వరకు కార్యకర్తలు మీ కోసం పని చేశారని, రానున్న లోకల్​ బాడీ ఎన్నికల్లో వారిని గెలిపించే బాధ్యతను మీరు తీసుకోవాలని  సీఎం సూచించారు.