బుల్డోజర్లు ఎక్కించి మరీ మూసీ ప్రాజెక్టు చేపడుతాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటే బుల్డోజర్లు ఎక్కించి మరీ ప్రాజెక్టు చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మూసీని అడ్డుకుంటే కుక్కచావు తప్పదని సీఎం చెప్పారు. ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా జనవరిలో ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

2025 నూతన సంవత్సరంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకూ చార్మినార్ దగ్గర లక్షలాది మందితో కదంతొక్కుతామని, వాడపల్లిలో జనవరి మొదటివారంలో పాదయాత్ర చేస్తానని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Also Read:-ఈ మూసీని ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగ...

తన వెంట నడుస్తానన్న హరీశ్, కేటీఆర్ కు సవాల్ విసురుతున్నానని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డేట్ చెప్పండని, తాను రెడీ అని సీఎం ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ దోపిడీని ప్రజలకు కండ్లకు కట్టినట్లు వివరించామని, మూసీ పునరుజ్జీవనం చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రూ.2 కోట్లతో భీమలింగం శివన్న దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని సీఎం చెప్పారు.