స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్​ స్కూల్స్ డిజైన్ల పరిశీలన

  • పలు సూచనలు చేసిన సీఎం రేవంత్​

హైదరాబాద్, వెలుగు : స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి ప్రాథమిక డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం సెక్రటేరియెట్​లో పరిశీలించారు. ఈ సందర్భంగా డిజైన్స్ పై ఆర్కిటెక్ట్స్ కు సీఎం పలు సూచనలు చేశారు. సూచించిన మార్పులతో వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు.

ALSO READ : మూసీ పొడవునా ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు!

 స్కిల్ యూనివర్సిటీ డిజైన్​లను పరిశీలిస్తే అకడమిక్ బ్లాక్ జీ ప్లస్ 4, అడ్మినిస్ట్రేసన్ బ్లాక్ జీ ప్లస్​4, బాయ్స్, గర్ల్స్ హాస్ట్సల్ వేర్వేరుగా జీ ప్లస్10, డైనింగ్ బ్లాక్ జీ ప్లస్ 3లా.. ఇతరత్రా అన్నింటిని డిజైన్​లలో రూపొందించారు. వీటిలో ఇంకిన్ని మార్పులు చేస్తున్నారు.