ట్రిపుల్ ఆర్​ భూసేక‌ర‌ణలో స్పీడ్​ పెంచండి : సీఎం రేవంత్​రెడ్డి 

  • సౌత్​ వైపు పనులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి: సీఎం రేవంత్​రెడ్డి 
  • భ‌విష్యత్తు అవ‌స‌రాల‌కు త‌గ్గట్టు అలైన్‌మెంట్‌ ఉండాలి
  • ఈ విషయంలో పార‌ద‌ర్శకంగా వ్యవ‌హ‌రించండి
  • సాంకేతిక సమస్యలుంటే కేంద్రంతో చర్చించండి
  • పనులపై ప్రతిరోజూ రివ్యూ చేసి, అప్​డేట్​ చేయండి
  • రీజినల్ ​రింగ్ ​రోడ్డుపై అధికారులతో సీఎం సమీక్ష

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  రీజిన‌‌‌‌‌‌‌‌ల్ రింగు రోడ్డు  సౌత్​ భూసేకరణలో వేగం పెంచాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అలైన్​మెంట్,  భూసేకరణపై  క‌‌‌‌‌‌‌‌లెక్టర్లతో రోజూవారీ రివ్యూ చేసి, పనుల పురోగ‌‌‌‌‌‌‌‌తిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు.  గూగుల్ మ్యాప్ లో ట్రిపుల్​ఆర్​ను పరిశీలించిన సీఎం,  ద‌‌‌‌‌‌‌‌క్షిణ భాగం ప్రతిపాదిత అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కొన్ని మార్పులు, చేర్పుల‌‌‌‌‌‌‌‌ను సూచించారు. భ‌‌‌‌‌‌‌‌విష్యత్తు అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాలకు తగ్గట్టుగా అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉండాల‌‌‌‌‌‌‌‌ని, ఈ విష‌‌‌‌‌‌‌‌యంలో పార‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌ర్శకంగా వ్యవ‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌రించాల‌‌‌‌‌‌‌‌ని అన్నారు.

తాను సూచించిన మార్పుల‌‌‌‌‌‌‌‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో ప‌‌‌‌‌‌‌‌ర్యటించి, స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌గ్ర నివేదిక‌‌‌‌‌‌‌‌ను త్వర‌‌‌‌‌‌‌‌గా అంద‌‌‌‌‌‌‌‌జేయాల‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు. ట్రిపుల్​ఆర్​ ప్రగతిపై  బుధవారం సెక్రటేరియేట్​లో అధికారులతో సీఎం రేవంత్​రివ్యూ చేశారు.  ట్రిపుల్​ఆర్​సౌత్​భాగం సంగారెడ్డి-–ఆమ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌–-షాద్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌–-చౌటుప్పల్ (189.20 కిలోమీటర్లు) మార్గానికి సంబంధించి భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ ప్రారంభించాల‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు. ఉత్తర భాగంలో ఇప్పటికే భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ చాలా వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు పూర్తయినందున ద‌‌‌‌‌‌‌‌క్షిణ భాగంలోనూ ప్రారంభించాల‌‌‌‌‌‌‌‌ని అన్నారు. ఈ రోడ్డు విష‌‌‌‌‌‌‌‌యంలో ఏవైనా సాంకేతిక‌‌‌‌‌‌‌‌, ఇత‌‌‌‌‌‌‌‌ర స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చ‌‌‌‌‌‌‌‌ర్చించాల‌‌‌‌‌‌‌‌ని సూచించారు.

ట్రిపుల్​ఆర్​ఉత్తర భాగంలో భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌, ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివ‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌ను రేవంత్​కు అధికారులు తెలియ‌‌‌‌‌‌‌‌జేశారు. భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణలో వేగం పెంచాలని, ఇందుకు సంబంధించిన  డెయిలీ ప్రోగ్రెస్​ను క‌‌‌‌‌‌‌‌లెక్టర్లు  ప్రతిరోజు సాయంత్రానికి సీఎస్​కు అంద‌‌‌‌‌‌‌‌జేయాల‌‌‌‌‌‌‌‌ని సీఎం సూచించారు. భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌లోనూ పార‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌ర్శకంగా వ్యవ‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌రించాల‌‌‌‌‌‌‌‌ని, సీఎస్‌‌‌‌‌‌‌‌తోపాటు మౌలిక వ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌తులు, ప్రాజెక్టుల స‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హాదారు శ్రీ‌‌‌‌‌‌‌‌నివాస‌‌‌‌‌‌‌‌రాజు, సీఎం ఓఎస్డీ షాన‌‌‌‌‌‌‌‌వాజ్ ఖాసీం, ఆయా జిల్లాల క‌‌‌‌‌‌‌‌లెక్టర్లు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారుల‌‌‌‌‌‌‌‌తో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ఎప్పటిక‌‌‌‌‌‌‌‌ప్పుడు ప‌‌‌‌‌‌‌‌నుల పురోగ‌‌‌‌‌‌‌‌తిని అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాల‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఒక స‌‌‌‌‌‌‌‌మీక్ష స‌‌‌‌‌‌‌‌మావేశానికి మ‌‌‌‌‌‌‌‌రో రివ్యూకు  మ‌‌‌‌‌‌‌‌ధ్య కాలంలో  త‌‌‌‌‌‌‌‌ప్పనిస‌‌‌‌‌‌‌‌రిగా ప్రోగ్రెస్​ ఉండాల‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు.  

ఫ్యూచర్​ సిటీ రేడియల్ రోడ్లపైనా సూచనలు

ఫ్యూచ‌‌‌‌‌‌‌‌ర్ సిటీకి సంబంధించి రేడియ‌‌‌‌‌‌‌‌ల్ రోడ్ల నిర్మాణంపైనా సీఎం రేవంత్ అధికారు ల‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌లు సూచ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు చేశారు. రోడ్ల నిర్మా ణానికి ముందే ఎక్కడెక్కడ అవి మెయిన్​ రోడ్లకు లింక్​ అవుతాయో స్పష్టత రావాలని అన్నారు. సిగ్నల్‌‌‌‌‌‌‌‌ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్య లేకుండా సాఫీగా ప్రయాణం సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌ని సూచిం చారు. రేడియ‌‌‌‌‌‌‌‌ల్ రోడ్లు, ఓఆర్ఆర్​, ట్రిపుల్​ఆర్​ అనుసంధానానికి అనువుగా ఉండాల‌‌‌‌‌‌‌‌ ని, ఫ్యూచ‌‌‌‌‌‌‌‌ర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ ర‌‌‌‌‌‌‌‌కాల ప‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌లు, సంస్థల‌‌‌‌‌‌‌‌కు ఉప‌‌‌‌‌‌‌‌యోగ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ రంగా ఉండేలా చూడాల‌‌‌‌‌‌‌‌న్నారు.

ఇయ్యాల ఢిల్లీకి సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేతో ఆయన భేటీ కానున్నట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ, సెక్రటేరియెట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు, వరంగల్ లో రాహుల్ రైతు కృతజ్ఞత సభ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన తేదీ ఖరారు చేసి.. సోనియా, రాహుల్ , ప్రియాంకను ఆహ్వానించనున్నట్టు సమాచారం. వరంగల్ సభకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్టు తెలుస్తున్నది.