ప్రభుత్వ హాస్టల్స్ మెనూలో మార్పు.. 10 రోజుల్లో కొత్త డైట్

  • పోషకాహారం అందేలా  హాస్టల్​ స్టూడెంట్ల మెనూలో మార్పులు చేయండి
  • డైట్, కాస్మోటిక్ చార్జీల  పెంపు నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలు
  • ముఖ్యమంత్రికి అధికారులు, ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు

హైదరాబాద్​, వెలుగు : ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు 10 రోజుల్లో కొత్త డైట్​ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు.  ప్రభుత్వ వ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌తిగృహ విద్యార్థుల‌‌‌‌‌‌‌‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్​ రెడ్డిని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ  ప్రతిపాదనను యథావిధిగా అమలు చేశామని, దీంతో 40 శాతం చార్జీలు పెరిగాయని తెలిపారు. పెరిగిన డైట్ చార్జీలకు తగ్గట్టుగా విద్యార్థులకు మరింత పోషకాహారం అందేలా మెనూలో  మార్పులు చేయాలని సూచించారు.వీలైనంత త్వరగా ఈ  ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్​కు మంత్రి సీతక్క, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, సంజయ్ కలిసి  ధన్యవాదాలు  తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా డైట్, కాస్మోటిక్ చార్జీలు 40 శాతం పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పెంపుతో 7,65,705 మంది విద్యార్థుల‌‌కు  ప్రయోజ‌‌నం కలుగుతుందన్నారు.  

 స్టూడెంట్లకు అసలైన దీపావళి: మంత్రి సీతక్క

రాష్ట్రంలో విద్యారంగ స‌‌మస్యలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు.సంక్షేమ‌‌ హాస్టల్, గురుకుల స్టూడెంట్లకు డైట్, కాస్మోటిక్ చార్జీలు 40 శాతం పెంచామని చెప్పారు. ‘‘ఇదే విద్యార్థులకు అసలైన దీపావళి. బీఆర్ఎస్ హయాంలో ఏడేండ్లుగా  డైట్ చార్జీలు ,16  ఏండ్లుగా కాస్మోటిక్ చార్జీలు పెర‌‌గ‌‌లేద‌‌ు. ఇప్పుడు కాంగ్రెస్​ సర్కారే పెంచింది. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పెరిగిన ధరలకు తగ్గట్టుగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎంకు ధన్యవాదాలు. ఇక నుంచి హాస్టల్ విద్యార్థులు అర్ధాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదు. పెరిగిన డైట్ చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లు, హాస్టల్ సిబ్బందిపై ఉంది. చార్జీలు గ్రీన్ చానల్ ద్వారా చెల్లిస్తాం. పదేండ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ మౌలిక వసతులు  కల్పించలేదు. సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లల్లో సదుపాయాల  కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు”అని తెలిపారు.  ములుగులో సమ్మక్క- సారలమ్మ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు కేటాయించడంపై సీఎం రేవంత్​కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఏడేండ్లుగా డైట్​చార్జీలు పెరగలే: ఎంపీ చామల

హాస్టల్​ విద్యార్థులకు మంచి పోషకాహారం అందిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతో  ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి  తెలిపారు. అందుకే గతంలో  ఎన్నడూలేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్  చార్జీలు 40% పెంచామని తెలిపారు.  గత ఏడేండ్లుగా డైట్ చార్జీలు, 16 ఏండ్లుగా కాస్మోటిక్  చార్జీలు పెరగలేదని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్..​ ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు  కల్పించలేదని,  విద్యార్థులు అర్ధాకలితో అలమటించారని అన్నారు.  పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలనే ఆలోచనతో సీఎం రేవంత్​ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.