2 నుంచి రేషన్​ కార్డులకు అప్లికేషన్లు

కార్డుల జారీకి ప‌‌టిష్ట కార్యాచ‌‌ర‌‌ణ : సీఎం 

హైద‌‌రాబాద్‌‌, వెలుగు : కొత్త రేష‌‌న్ కార్డుల కోసం అక్టోబ‌‌రు 2 నుంచి ద‌‌ర‌‌ఖాస్తులు స్వీక‌‌రించాల‌‌ని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. రేష‌‌న్ కార్డుల జారీకి ప‌‌టిష్ట కార్యాచ‌‌ర‌‌ణ ప్రణాళిక రూపొందించాల‌‌ని సూచించారు. రేష‌‌న్ కార్డులకు సంబంధించిన విధివిధానాల‌‌పై సీఎం రేవంత్​రెడ్డి గురువారం సెక్రటేరియెట్​లో  స‌‌మీక్ష నిర్వహించారు. 

ఈ సంద‌‌ర్భంగా కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌‌నివాస్ రెడ్డి, దామోద‌‌ర రాజ‌‌న‌‌ర‌‌సింహ, అధికారుల‌‌కు ప‌‌లు సూచ‌‌న‌‌లు చేశారు. అర్హులంద‌‌రికీ డిజిట‌‌ల్ రేష‌‌న్ కార్డులు ఇచ్చేందుకు క‌‌స‌‌ర‌‌త్తు చేయాలన్నారు. ఈ అంశంపై త్వర‌‌లోనే మ‌‌రోసారి స‌‌మీక్ష నిర్వహించాల‌‌ని నిర్ణయించారు. సీఎస్​ శాంతికుమారి, ఉన్నతాధికారులు రివ్యూలో పాల్గొన్నారు.