పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అభినందించిన సీఎం రేవంత్రెడ్డి 

హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి న గడ్డం వంశీకృష్ణను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. వంశీకృష్ణతోపాటు చెన్నూరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం సరోజ వివేక్ ఉన్నారు.  

ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గాను  కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు సాధించి తమ పాలనకు రెఫరెండంగా చాటుకుంది. పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ దాదాపు లక్షా 30 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ద్దపల్లి పార్లమెంట్‌ నియోజవర్గంలో  15 లక్షల 96 వేల 430 ఓట్లకుగాను 10లక్షల 83వేల 453 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 4లక్షల 80వేల 994 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌కు 3లక్షల 49వేల 339 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 1లక్షల 94వేల 821 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ  1లక్షల 31వేల 771 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.