జర్నలిస్టు బాంధవుడు

2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7న  రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, బాధ్యతలు తీసుకున్న తర్వాత పత్రికా రంగంలో పెద్ద మార్పులే వచ్చాయి.  ముఖ్యమంత్రి, మంత్రులు ఏర్పాటు చేసే విలేకర్ల సమావేశంలో పాత్రికేయులు స్వేచ్ఛగా ప్రశ్నలు అడగ గలుగుతున్నారు.  హైదరాబాద్ లోని జవహర్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ (జెఎన్‌‌‌‌‌‌‌‌జెహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌)కి చెందిన  వెయ్యిమందికి పైగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం భూమిని ఇవ్వాలని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం 7 సంవత్సరాల్లో తీసుకోలేకపోయిన నిర్ణయాన్ని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వం తొమ్మిది నెలల్లో తీసుకుంది. 2024 సెప్టెంబరు 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్​లోని  రవీంద్రభారతిలో ఏర్పాటు చేసే బహిరంగ సమావేశంలో.. ఇండ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమిని స్వాధీనం చేసే అధికారిక డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ను  జవవహర్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌  నెహ్రూ జర్నలిస్టుల మ్యాక్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి అందిస్తామని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  ప్రభుత్వం  ప్రకటించింది. 

వైఎస్​ చొరవ 

వై.ఎస్‌‌‌‌‌‌‌‌. రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సీఎంగా ఉండగా జవహర్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌  నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి  రాష్ట్ర  ప్రభుత్వం 70 ఎకరాల భూమిని మార్కెట్‌‌‌‌‌‌‌‌ ధరకు కేటాయిస్తూ 25.03.2008న ఉత్తర్వులు (జీఓ.ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌.నెం. 424) జారీ చేసింది.  మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో 332 సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌లో 32 ఎకరాలు, ఇదే  జిల్లా కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌లో 25/2 సర్వే నెంబరులో 38 ఎకరాలు కేటాయించారు.

జర్నలిస్టులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌‌‌‌‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులతో కూడిన హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీలకు కూడా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండ్లకోసం భూములను కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ వీరికి ఇంటి స్థలాలు ఇవ్వొద్దంటూ ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్‌‌‌‌‌‌‌‌) హైకోర్టులో  దాఖలయింది. ఈ వాజ్యంపై  హైకోర్టు 5. 1.2010న తీర్పు చెబుతూ ఇండ్లు, ఇంటి స్థలాలు లేనివారికి మాత్రమే స్థలాలు ఇవ్వాలని సూచించింది. 

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైకోర్టు తీర్పును సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ   ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో  పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేసింది. ప్రజాసేవలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌‌‌‌‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ‘వన్‌‌‌‌‌‌‌‌టైం బెనిఫిట్‌‌‌‌‌‌‌‌’ కింద ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌‌‌‌‌‌‌‌ లీవ్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేసింది.

జె.ఎన్‌‌‌‌‌‌‌‌.జె. హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ కూడా ఈ కేసులో ఇంప్లీడ్‌‌‌‌‌‌‌‌ అయింది. 2017  మే 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జెఎన్‌‌‌‌‌‌‌‌జె హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి 70 ఎకరాల భూమిని స్వాధీనం చేయాలని సూచించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను విస్మరించిన కేసీఆర్ సర్కార్​

సుప్రీంకోర్టు సూచనల మేరకు నిజాంపేటలోని 32 ఎకరాల భూమిని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం 2018లో జర్నలిస్టుల సొసైటీకి స్వాధీనం చేసింది. పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌లో భూమిని మాత్రం స్వాధీనం చేయలేదు. పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌లోని 38 ఎకరాల భూమిని జెఎన్‌‌‌‌‌‌‌‌జె హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి స్వాధీనం చేయవచ్చని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ప్లీడర్‌‌‌‌‌‌‌‌ (రెవెన్యూ) ప్రభుత్వానికి 2017 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 30న లేఖ రాశారు. 38 ఎకరాల భూమిని జెఎన్‌‌‌‌‌‌‌‌జె హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి స్వాధీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని జీపీ సూచన మేరకు ఒక అధికారిక లేఖను 2018 మార్చి 3న ఆనాటి ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ పంపించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఈ ఫైలుపై  నిర్ణయం తీసుకోకుండా ఏడు సంవత్సరాల కాలం గడిపారు.38 ఎకరాల భూమిని జెఎన్‌‌‌‌‌‌‌‌జె హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి స్వాధీనం చేయని విషయం సుప్రీంకోర్టు దృష్టికి జర్నలిస్టులు తీసుకురాగా 2022 ఆగస్టు 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.వి. రమణ నేతృత్వంలోని  త్రిసభ్య బెంచి తీర్పు చెప్పింది.  పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌లోని 25/2 సర్వే నెంబరులో ఉన్న 38 ఎకరాల భూమిని జెఎన్‌‌‌‌‌‌‌‌జె హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి వెంటనే స్వాధీనం చేయాలని ఆదేశించింది. జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం 70 ఎకరాలు కేటాయించగా ఈ సొసైటీ రూ.12 కోట్ల 33 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారని సుప్రీంకోర్టు తన తీర్పులో గుర్తు చేసింది.

ఇంటి స్థలాలు తమ చేతికి వస్తే ఇండ్లు కట్టుకోవాలని జర్నలిస్టులు 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని తన తీర్పులో పేర్కొన్నది. 38 ఎకరాలను ప్రభుత్వం ఈ సొసైటీకి స్వాధీనం చేయాలని చెబుతూ, ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సొసైటీలో సభ్యులైన జర్నలిస్టులు ఇండ్లు కూడా నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.  సుప్రీంకోర్టు 2017లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కాని, 2022 ఆగస్టు 25న జారీ చేసిన త్రిసభ్య బెంచి తీర్పును గానీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023 డిసెంబరు దిగిపోయేవరకు అమలు చేయలేదు.

కొత్త కమిటీ  నేతృత్వం

2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 21న  టీం జెఎన్‌‌‌‌‌‌‌‌జె నేతృత్వంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రవీంద్రభారతిలో బహిరంగసభ జరిగింది. ప్రభుత్వం తరఫున మల్లురవి ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌లోని 38 ఎకరాలు జె.ఎన్‌‌‌‌‌‌‌‌.జె.కు స్వాధీనం చేస్తామని హామీ ఇచ్చారు.  జెఎన్‌‌‌‌‌‌‌‌జె హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. 

పదేండ్ల తర్వాత ఈ సొసైటీకి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు 2024 మార్చి 3న జరిగాయి. కొత్తగా అయిదుగురు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన బోర్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్లు (జిఓడి) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి జెఎన్‌‌‌‌‌‌‌‌జెకు అండగా నిలిచారు. పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌ భూమి జెఎన్‌‌‌‌‌‌‌‌జె సొసైటీకి అప్పగించేందుకు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాంతో జె.ఎన్‌‌‌‌‌‌‌‌.జె. జర్నలిస్టుల 17 సంవత్సరాల కల సాకారం అవుతోంది.

జర్నలిస్టులకు రేవంత్​ భరోసా

 రెవెన్యూ మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని జెఎన్‌‌‌‌‌‌‌‌జె హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ ప్రతినిధులు, సభ్యులు పలు దఫాలుగా కలిసారు. పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫైలును సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.  సీఎం కూడా  ఆమోదముద్ర వేశారు.  22. 8.2024న బిఓడి ప్రతినిధులు రెవెన్యూ మంత్రితో ఆయన ఛాంబర్‌‌‌‌‌‌‌‌లో చర్చించారు.  సీఎం ఆదేశాలకు మేరకు 2024 సెప్టెంబరు 8న రవీంద్రభారతిలో ఏర్పాటు చేసే సభలో పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌లో భూమిని హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీకి స్వాధీనం చేసేందుకు సంబంధించిన మెమోను అందిస్తామని రెవెన్యూమంత్రి వెల్లడించారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌‌‌‌‌‌‌‌  కె. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సమక్షంలో ఇటీవల అధికారుల సమావేశం జరిగింది.   సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి జర్నలిస్టులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని జర్నలిస్టు బంధుగా పేరు తెచ్చుకున్నారు.. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు కూడా దశలవారీగా అమలు అవుతాయని రాష్ట్రంలోని జర్నలిస్టులు నమ్ముతున్నారు.

పోరుబాటకు రేవంత్​ మద్దతు

సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌లో 38 ఎకరాలు తమకు స్వాధీనం చేయాలని జె.ఎన్‌‌‌‌‌‌‌‌.జె.లో భాగస్వామ్యం అయిన సభ్యులు ‘టీం జెఎన్‌‌‌‌‌‌‌‌జె’ పేరుతో పోరుబాట పట్టాం.  పలు పత్రికల సంపాదకులు హాజరై తమ మద్ధతు తెలిపారు.  2023 జులై 18న ఇందిరాపార్క్​ సమీపంలోని ధర్నాచౌక్‌‌‌‌‌‌‌‌లో భారీ ఎత్తున ధర్నా చేసారు. ఆనాటి టీపీసీసీ అధ్యక్షుడు (నేటి ముఖ్యమంత్రి) ఎ. రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి టీం జెఎన్‌‌‌‌‌‌‌‌జెకు మద్దతు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం 2023 చివరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని, తాము అధికారంలో వచ్చిన తర్వాత పేట్‌‌‌‌‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌‌‌‌‌ భూమిని జెఎన్‌‌‌‌‌‌‌‌జె సొసైటీకి స్వాధీనం చేస్తామని హామీ ఇచ్చారు. 

- పి.వి. రమణారావు