ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు..జీవో 29పై గ్రూప్​ 1​ అభ్యర్థులు అపోహలు పెట్టుకోవద్దు : సీఎం రేవంత్​

  • అందరికీ న్యాయం చేయాలనే ఆ జీవో తెచ్చినం
  • నోటిఫికేషన్​ ఇచ్చినప్పుడే అభ్యంతరాలు చెప్తే సరిచేసేవాళ్లం
  • మధ్యలో మారిస్తే కోర్టుల జోక్యంతో పరీక్ష రద్దయ్యే ప్రమాదం
  • ఎగ్జామ్స్​ వాయిదా పడితే నిరుద్యోగులకే తీవ్ర నష్టం
  • అపోహలు వీడి మెయిన్స్​ రాయాలని సూచన
  • నిరుద్యోగులపై దురుసుగా ప్రవర్తించొద్దు.. అరెస్ట్​ చేయొద్దని పోలీసులకు ఆదేశం
  • పోలీస్ డ్యూటీ మీట్–2024 ముగింపు వేడుకలకు హాజరు

హైదరాబాద్​, వెలుగు : ప్రతిపక్షాల ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని, జీవో 29పై గ్రూప్ ​1​ అభ్యర్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ‘‘తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్లు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు గోసపడ్డారు. నిరుద్యోగుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన గత పాలకులు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు గ్రూప్‌‌‌‌1 అభ్యర్థులను రెచ్చగొడ్తున్నరు. వారి మాటలను నిరుద్యోగులు నమ్మొద్దు. పరీక్షలు రాయకుండా బంగారు భవిష్యత్​ను నాశనం చేసుకోవద్దు.

ఇది మీ ప్రభుత్వం.. మీ స‌‌‌‌మ‌‌‌‌స్యలు ప‌‌‌‌రిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని చెప్పారు. అపోహలు వీడి గ్రూప్​ 1 మెయిన్స్ రాయాలని అభ్యర్థులకు సీఎం సూచించారు. పరీక్షలు వాయిదా వేయడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. గతంలో నిరుద్యోగులు ఏండ్ల తరబడి అశోక్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవాళ్లు అని.. ఇప్పుడు ఆ పరిస్థితులను మారుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జీవో 55 ప్రకారం గ్రూప్​ 1 అభ్యర్థులను మెయిన్స్​కు ఎంపిక చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని.. అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే జీవో 29 తెచ్చామని.. ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్​లోనే జీవో 29 గురించి మెషన్​ చేశామని వివరించారు.

ప్రిలిమ్స్​ ఫలితాల్లో 1:50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిమ్స్​కు ఎంపిక చేశామని.. కానీ, కొన్ని రాజకీయ పార్టీలు వితండవాదం చేస్తున్నాయని, మధ్యలో నిబంధనలు మారిస్తే కోర్టులు పరీక్షల్ని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. 4 రోజులుగా రాష్ట్ర పోలీస్ అకాడమీలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్–2024 ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించగా..   సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. 

పదేండ్లు అధికారంలో ఉండి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. 

‘‘పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయిం ట్​మెంట్ ఇవ్వని వాళ్లు.. గ‌‌‌‌ద్దర్​ను ప్రగ‌‌‌‌తి భ‌‌‌‌వ‌‌‌‌న్ గేటు వ‌‌‌‌ద్ద 4 గంట‌‌‌‌లు ఎర్రటి ఎండ‌‌‌‌లో నిల‌‌‌‌బెట్టిన నీచ‌‌‌‌మైన చ‌‌‌‌రిత్ర ఉన్నవాళ్లు ఇప్పుడు మిమ్మల్ని ద‌‌‌‌గ్గరకు పిలుస్తు న్నారంటే ఇది కొంగ జపం కాదా? నిరుద్యోగులు ఒక్క సారి ఆలోచించాలి” అని సీఎం రేవంత్​ అన్నారు. తెలంగాణ ఉద్యమ టైమ్​లోనూ నిరుద్యోగులను రెచ్చగొట్టి, ప్రాణాలు బలిగొన్నారని... నిరుద్యోగుల త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఆ తర్వాత నిరు ద్యోగులను పట్టించుకోలేదని బీఆర్​ఎస్​ నేతలపై మండి పడ్డారు.

‘‘‘వీళ్లు ఎలాంటి దుర్మార్గులో ఒక్కసారి ఆలోచించాలి. నాడు కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, యాద‌‌‌‌య్య, యాదిరెడ్డిని ఉసిగొప్పి ప్రాణాలు బ‌‌‌‌లితీసుకున్నరు. వారి త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చి ఉన్నత ప‌‌‌‌ద‌‌‌‌వులు చేపట్టాక కనీసం నిరుద్యోగుల ముఖం కూడా చూడలేదు” అని ఆయన అన్నారు.  పదేండ్లు నిరుద్యోగులను పట్టించుకోని వాళ్లు.. ఇప్పుడు పరీక్షలను అడ్డుకుంటున్నారంటే ఎందుకో ఆలోచించాలని సూచించారు. ‘‘ప‌‌‌‌రీక్షలు నిర్వహించ‌‌‌‌డం వ‌‌‌‌ల్ల  నాకు, నా కుటుంబానికి ఏమైనా లాభం ఉంటదా?

మేం నిరుద్యోగుల కోసమే ఆలోచిస్తున్నం. కానీ, వారి జీవితాలతో  ఆటలాడుతున్న ఈ అపోహల సంఘం ఉచ్చులో పడ్తే నష్టపోయేదెవరు? నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాటి నుంచి బయటపడి  గ్రూప్​ 1 మెయిన్స్​ రాయండి. గ్రూప్​ 1 అధికారులై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులవ్వండి” అని ఆయన కోరారు. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోలీస్​ స్కూల్​

రాష్ట్ర ఏర్పాటులో పోలీసులది కీలకపాత్ర అని,  రాష్ట్ర సాధనలో పోలీస్ కిష్టయ్య త్యాగం ఎప్పటికీ మరిచిపోలేమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పోలీస్ ఉద్యోగం ఒక ఉద్యోగం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం. పోలీస్ శాఖ గౌరవం పెరిగితే ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్ సేవలు, త్యాగం వల్లే ప్రజలు నిర్భయంగా ఉండగలుగుతున్నారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధిలో పోలీసులది కీలక పాత్ర. పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ఆయన తెలిపారు.

గ్రేహౌండ్స్‌‌‌‌కు చెందిన 50 ఎక‌‌‌‌రాల స్థలంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొద‌‌‌‌టి ద‌‌‌‌శ‌‌‌‌లో 5 నుంచి 8 త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి వ‌‌‌‌ర‌‌‌‌కు ప్రారంభించి ద‌‌‌‌శ‌‌‌‌ల వారీగా విస్తరిస్తామని, క్రమంగా డిగ్రీ, ఇంజ‌‌‌‌నీరింగ్‌‌‌‌, మెడిక‌‌‌‌ల్ కాలేజీలు ఏర్పాటుచేస్తామన్నారు.  హోంగార్డు నుంచి డీజీపీ వ‌‌‌‌ర‌‌‌‌కు ఎవ‌‌‌‌రైనా తమ పిల్లల్ని ఈ స్కూల్‌‌‌‌లో చేర్పించ‌‌‌‌వచ్చని తెలిపారు. పోలీస్ డ్యూటీ మీట్‌‌‌‌లో ఇక‌‌‌‌పై ప‌‌‌‌త‌‌‌‌కాలు సాధించే సిబ్బందికి న‌‌‌‌గ‌‌‌‌దు ప్రోత్సాహ‌‌‌‌ కాలు అందిస్తామ‌‌‌‌ని.. ప్రథమ బ‌‌‌‌హుమ‌‌‌‌తి సాధిస్తే రూ. 5లక్షలు

ద్వితీయ బ‌‌‌‌హుమ‌‌‌‌తికి రూ.3 ల‌‌‌‌క్షలు, తృతీయ స్థానంలో నిలిచేవారిక లక్షన్నర చొప్పున ఇస్తామ‌‌‌‌న్నారు. అలాగే, గంజాయి, డ్రగ్స్​ కేసుల్లో క‌‌‌‌ఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. సైబ‌‌‌‌ర్ నేరాల క‌‌‌‌ట్టడితోపాటు వాటిపై ప్రజలకు పోలీసులు అవ‌‌‌‌గాహ‌‌‌‌న క‌‌‌‌ల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీజీపీ జితేంద‌‌‌‌ర్, సీఐడీ చీఫ్ శిఖాగోయ‌‌‌‌ల్, హోంశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి  ర‌‌‌‌వి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివ‌‌‌‌ధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

అప్పట్లోనే అభ్యర్థులుచెప్తే మార్చేవాళ్లం

గ్రూప్​ 1​ నోటిఫికేషన్​తో పాటే జీవో 29 ఇచ్చామ ని, అప్పట్లోనే అభ్యర్థులు అభ్యంతరాలు చెప్తే మార్చేందుకు ప్రయత్నించేవాళ్లమని సీఎం అన్నా రు. ప్రిలిమ్స్​ పూర్తయ్యి మెయిన్స్​ షెడ్యూల్​ వచ్చా క ఇప్పుడు జీవో మార్చా లనడం సరికాదని తెలి పారు. ఇప్పుడు మారిస్తే కోర్టులు జోక్యం చేసుకొ ని మొత్తం పరీక్షలే రద్దయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘‘జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదు. వారి రిజ ర్వేషన్​ కోటా ప్రకారం 1:50 చొప్పున అభ్యర్థు లను ఎంపికచేశాం.. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్తే  కోర్టు కూడా జీవో 29ను సమర్థించింది’’ అని సీఎం స్పష్టంచేశారు.

నిరుద్యోగులపై కేసులు పెట్టొద్దు

కొందరు నిరుద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నారని, వారిపై లాఠీచార్జ్​ చేయొద్దని, కేసులూ పెట్టొద్దని పోలీ సులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించా రు. ‘‘వాళ్లూ మన తెలంగాణ బిడ్డలే. పరీక్షలు రాసి  గ్రూప్-1 అధికారులు గా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ స్వాములు కాబోతున్నారు. వాళ్ల పై కేసులు పెట్టి వారి భవిష్యత్​ను దెబ్బతీ యొద్దు.. మానవీయ కోణంలో ముం దుకు వెళ్లండి’’ అని  సూచించారు.