వయనాడ్ వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం

  • నేడు ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వయనాడ్ వెళ్లారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి రానున్నట్లు సమాచారం.బుధవారం వయనాడ్ లో భారీ ర్యాలీ చేపట్టి మధ్యాహ్నం 12 గంటలకు ప్రియాంక గాంధీ వయనాడ్ బై పోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ, ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీలు మైసూర్ చేరుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఏఐసీసీ అగ్రనేతలు, పీసీసీ చీఫ్ లు, కేంద్ర మాజీ మంత్రులు పెద్దఎత్తున కార్యక్రమంలో పాల్గొననున్నారు.