భిక్కనూరు మండలంలో బాధితులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ

భిక్కనూరు, వెలుగు:  మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన మాధుసూధన్​ రెడ్డి, ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన మాధుసూధన్​ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికాగా..   ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ ఆలీ  చొరవతో  సీఎం ఆర్​ఎఫ్​ అందినట్టు  మండలాధ్యక్షుడు భీమ్​రెడ్డి తెలిపారు. ఈ చెక్కులను ఆదివారం బాధితులకు అందించారు. ఈ ఈకార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్​ మద్ది చంద్రకాంత్​ రెడ్డి,  పీసీసీ రాష్ర్ట కార్యదర్శి బద్దం ఇంద్రకరన్​ రెడ్డి, మార్కెట్​ కమిటీ చైర్మన్​ పాత రాజు, మాజీ ఎంపీపీ గాల్​రెడ్డి, పార్టీ టౌన్​ అధ్యక్షుడు అందె దయాకర్​ రెడ్డి పాల్గొన్నారు.