గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలో 634 డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలువురు లబ్ధిదారులు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పటాకులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ చాలా ఏండ్లు కిరాయి ఇండ్లల్లోనే ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ బాధలను గుర్తించి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో డబుల్‌బెడ్రూం ఇండ్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.