Good Health: చలికాలంలో లవంగాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఈ వ్యాధులను ఇట్టే నయం చేస్తాయి..!

లవంగాలు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా.. లవంగాలకు వైద్య విలువలు కూడా ఉన్నాయి. లవంగ నూనెను పంటి నొప్పికి మందుగా ఉపయోగిస్తారు. బాగా నలిపిన లవంగ ఆకులు పంటి నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఎసిడిటీ, అజీర్ణానికి లవంగ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. రుచి, కారం కోసం కూరలలో ఎక్కువగా వాడుతుంటారు. వంటకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం

లవంగాల వల్ల ప్రయోజనాలు:

  • కఫం, పిత్త రోగాల బారిన పడితే ప్రతి రోజూ లవంగాలను తింటే ఈ జబ్బులు మాయమౌవుతాయి. 
  • ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది. 
  • జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
  • నిత్యం లవంగాలను తినాలనుకునే వారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే తినాలి. అంతకు మంచి వాడితే వేడి చేస్తోంది.
  • లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొందిస్తాయి. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి
  • ఎలాంటి చర్మవ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేస్తాయి. దీనిని చందనంతో పాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు దూరం అవుతాయి. 

.. వెలుగు లైఫ్