బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు.. రూ. 30 లక్షల ఆస్తి నష్టం

జగిత్యాలలో అగ్ని ప్రమాదం జరిగింది.  టవర్​ సర్కిల్​ దగ్గర ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి.  షాపు నుండి దట్టంగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి  సమాచారం అందించారు.   ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది మంటలను అదుపు చేశారు.  ఈ ఘటనలో రూ. 30 లక్షల మేర నష్టం జరిగిందని అమ్మాజీ డ్రెస్సెస్ షాప్ యజమాని తెలిపారు.  ప్రమాదం జరిగిన సమయంలో షాపు మూసి ఉండటంతో భారీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  దీపావళి టపాసులు కాల్చే సమయంలో నిప్పు రవ్వలు షాపై పడ్డాయని షాపు యజమాని అనుమానం వ్యక్తం చేశారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .